Markapuram: జలజీవన్ మిషన్: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం!
Markapuram: మార్కాపురం జిల్లాలో జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.
Markapuram: జలజీవన్ మిషన్: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం!
Markapuram: మార్కాపురం జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిని అందించడానికి ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి లక్ష్యంగా నిర్ణయిం చిందన్నారు. జిల్లాలో జలజీవన్ మిషన్ క్రింద2వేల225 పనులు 1780కోట్ల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జలజీవన్ మిషన్ క్రింద హనుమంతు నిపాడు, పుల్లల చెరువు, త్రిపురాంత కం మండలాల్లో 18.2 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన ప్రభుత్వా న్ని పంపడానికి చర్యలు తీసుకున్నా మని ఆమె చెప్పారు. జల జీవన్ మిషన్ క్రింద 119గ్రామాల్లో త్రాగునీటి పైపులను పునరుద్ధరించడానికి 30.5 కోట్ల రూపాయ లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపను న్నట్లు ఆమె చెప్పారు. జిల్లాలో త్రాగునీటి పథకాల పరిశీలించ డానికి టెక్నికల్ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈసమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్.ఇ అబూత్ అలీ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇ.ఇ సురేష్ బాబు, జిల్లామహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.




