Markapuram: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా చొరవతో మార్కాపురం పోలీస్ బలోపేతం!
Markapuram: మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా చొరవతో పోలీస్ వ్యవస్థ బలోపేతం: జిల్లాకు 450 మంది సిబ్బంది కేటాయింపు, కొత్త విభాగాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.
Markapuram: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా చొరవతో మార్కాపురం పోలీస్ బలోపేతం!
మార్కాపురం: జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మార్కాపురం జిల్లా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం కానున్నాయి. ఆయన చొరవతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 400 నుంచి 450 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంది.
స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ, మహిళా పోలీస్, ఇంటెలిజెన్స్, సీసీఎస్, ఐటీ కోర్, ట్రాఫిక్ విభాగాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మార్కాపురం టౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్ల అప్‌గ్రేడ్‌తో పాటు మహిళా, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, సీసీఎస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.




