Markapuram: జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలి!

Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ పెద్దారవీడు జెడ్పీటీసీ భర్త చిలక ఇజ్రాయెల్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Nov 2026 9:41 PM IST
Markapuram
X

Markapuram: జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలి!

మార్కాపురం: జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ పెద్దారవీడు జెడ్పీటీసీ చిలక చిన్న నానమ్మ భర్త చిలక ఇజ్రాయెల్ టీడీపీ నాయకులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసిన ఇజ్రాయెల్, తాజాగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు.

దీనిపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, అధిష్టానం నిర్ణయం మేరకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపినట్లు ఇజ్రాయెల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM