Markapuram: మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో డాక్టర్ మన్నె రవీంద్ర

Markapuram: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ రేసులో ఎర్రగొండపాలెం టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె రవీంద్ర పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Oct 2026 3:00 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో డాక్టర్ మన్నె రవీంద్ర

మార్కాపురం జిల్లా: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉండగా.. తాజాగా ఎర్రగొండపాలెం టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె రవీంద్ర పేరు తెరపైకి వచ్చింది.

మార్కాపురం జిల్లాలో జడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో మన్నె రవీంద్ర పేరు చర్చనీయాంశంగా మారింది. ఎర్రగొండపాలెం ప్రాంతంలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయనకు జడ్పీ చైర్మన్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి జడ్పీ చైర్మన్ ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం, స్థానిక రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉండనుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM