Markapuram: పేదలకు సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం: డాక్టర్ షేక్ షబానా!

Markapuram: మార్కాపురం పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని డాక్టర్ షేక్ షబానా తెలిపారు. స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలో ఆమె జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 Oct 2026 7:16 PM IST
Markapuram
X

Markapuram: పేదలకు సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం: డాక్టర్ షేక్ షబానా!

Markapuram: సమాజంలో సేవాభావమున్న వారిని కొందరినే చూస్తూ ఉంటాం!కానీ నిరంతరం సేవలోనే తరించే యోధులను ఆరుధుగా చూస్తుంటాము..అట్టివారిలో మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ షేక్ షబానా ఒకరు.సేవలోనూ కాదు రాజకీయాలలోనూ అంతే విస్వాసంతో ముందడుగు వేస్తున్న వ్యక్తి డాక్టర్ షేక్.షబానా!

అధికారం ఎక్కడ ఉంటే అక్కడ కండువాలు మార్చే ఈ రోజుల్లోనూ నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న గొప్ప సంస్కర్త డాక్టర్ షేక్ షబానా..!మంగళవారం న తన పుట్టిన రోజు, తన కుమారుడైన షేక్ హజ్మ జాహిద్ కు కుమారుడు పుట్టడం ద్వారా పట్టణంలోని స్థానిక స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల పాఠశాల నందు కేట్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు,పండ్లు పంపిణి చేసి జన్మదిన వేడుకలు జరుపుకొని ఆనందాన్ని పంచుకున్నారు..

ఈ నేపథ్యంలో డాక్టర్ షేక్ షబానా మాట్లాడుతూ పేదలు,అట్టడుగు వర్గాల ప్రజలకు మానవతా దృక్పథంతో అనేక సహాయ సహకారాలు అందించానని తెలిపారు..తన పుట్టినరోజు,మనవడు పుట్టిన నేపథ్యంలో మానసిక వికలాంగుల పిల్లల మధ్య ఇలా జరుపుకోవడం చాలా మానసిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు..

గత కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన సహాయాన్ని సహాయార్థులకు చేస్తూ అండగా నిలిచానని పేర్కొన్నారు..భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజాభ్యుదాయానికి తోడ్పడతానని తెలిపారు.. మనిషిగా జన్మించినందుకు ఖచ్చితంగా సేవ చేయాలనేదే తన అంతిమ లక్ష్యం అని వెల్లడించారు..ఈ వేడుకల్లో స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM