Markapuram: అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఆర్‌డీఓ ఆఫీస్‌కు ర్యాలీ!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 Aug 2026 11:38 PM IST
Markapuram
X

Markapuram: అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఆర్‌డీఓ ఆఫీస్‌కు ర్యాలీ!

మార్కాపురం జిల్లా: మార్కాపురం పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం వరకు తరలివెళ్లారు. అక్కడ అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెన్న హనుమారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సలీంతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story