Giddalur: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 70 కుటుంబాలు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం పెద్ద నల్లకాలువ, నర్సిరెడ్డి పల్లె గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.
Giddalur: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 70 కుటుంబాలు!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోనీ కంభం మండలం పెద్ద నల్లకాలువ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ .గ్రామానికి చెందిన బొట్టా రంగస్వామి, కాకర్ల సురేష్, చప్పిడి బుజ్జి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు , నర్సిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు దాదాపు గా 70 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరిన వారికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంభం మండల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




