Giddalur: గిద్దలూరులో కూటమి అభ్యర్థుల ప్రచారం: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి చైర్మన్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 29 Oct 2026 11:00 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో కూటమి అభ్యర్థుల ప్రచారం: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి 11వ వార్డు అభ్యర్థి నటుకుల శ్వేతలత, 12వ వార్డు అభ్యర్థి షేక్ ముభినా తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై ఓటువేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలి అని ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జె.వి. నారాయణ కమలం గుర్తుపై,11 వ వార్డు అభ్యర్థి నటుకుల శ్వేతలత, 12 వ వార్డు అభ్యర్థి షేక్ ముభినా గార్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు పిడతల రమేష్ రెడ్డి, గిద్దలూరు మార్కెట్ డైరెక్టర్ దూదేకుల బాదుల్లా, రంగస్వామి కమిటీ సభ్యుడు కొప్పుల నరసింహులు, టౌన్ అధ్యక్షులు ఆపిశెట్టి ఉదయ శంకర్, మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖాదర్ వలీ, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎం పుల్లయ్య, పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU