Markapuram: మార్కాపురం జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు
Markapuram: మార్కాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న 2020 బ్యాచ్ IPS అధికారి పంకజ్ కుమార్ మీనా. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి.
Markapuram: మార్కాపురం జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు
మార్కాపురం: 2020 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి పంకజ్ కుమార్ మీనా మార్కాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా గతంలో చింతూరు ASPగా విధులు నిర్వహించారు. అనంతరం ఆపరేషన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.
చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు, భద్రతా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. 2026లో తదుపరి బాధ్యతలు చేపట్టనున్న పంకజ్ కుమార్ మీనా.. మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణపై దృష్టి సారించనున్నారు.




