Markapuram: తొలి జెడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డికి బలిష్టమైన అవకాశం!

Markapuram: నూతన మార్కాపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డికి బలిష్టమైన అవకాశం. రికార్డు మెజార్టీతో టీడీపీ ఘన విజయం, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతానని వెల్లడి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Nov 2026 8:13 AM IST
Markapuram
X

Markapuram: తొలి జెడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డికి బలిష్టమైన అవకాశం!

Markapuram: నూతన మార్కాపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ పదవి కందుల కుటుంబాన్ని వరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కందుల రామిరెడ్డి భారీ మెజార్టీ సాధించి రాజకీయంగా తన సత్తా చాటుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలోనే గతంలో ఏ జెడ్పీ చైర్మన్ అభ్యర్థికి రానంత మెజార్టీ సాధించారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

సుమారు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న కందుల రామిరెడ్డి, తన అన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి అండగా ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ విజయానికి తన వంతు సహకారం అందించారు.

తన రాజకీయ సేవలను, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకం ఉంచి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారని కందుల రామిరెడ్డి తెలిపారు. అధిష్టానం తనకు కల్పించిన ఈ అవకాశాన్ని బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

దోర్నాల ప్రజలు తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఆయన, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, జెడ్పీటీసీ సభ్యులందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM