Markapuram: పెద్ద దోర్నాలలో ఇరకసాని దేవయ్యకు మద్దతుగా కందుల రోహిత్ ప్రచారం

Markapuram: పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఇరకసాని దేవయ్య యాదవ్‌కు మద్దతుగా ప్రత్యేక పూజలు, భారీ ర్యాలీ నిర్వహించిన కందుల రోహిత్ రెడ్డి.

Srikanth Singam, Markapur
Published on: 24 Nov 2026 7:03 PM IST
Markapuram
X

Markapuram: పెద్ద దోర్నాలలో ఇరకసాని దేవయ్యకు మద్దతుగా కందుల రోహిత్ ప్రచారం

మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇరకసాని దేవయ్య యాదవ్‌కు మద్దతుగా మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి తనయుడు కందుల రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ప్రదర్శనగా బయలుదేరారు.

దిగువ శ్రీశైలంగా పేరొందిన పెద్ద దోర్నాలలోని నటరాజు కూడలికి చేరుకున్న రోహిత్ రెడ్డి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నటరాజు విగ్రహం వద్ద, శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలకు జ్యోతి ప్రజ్వలన చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇరకసాని దేవయ్య యాదవ్‌కు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కందుల రోహిత్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ మాబు, బట్టు సుధాకర్ రెడ్డి, బట్టు రమణారెడ్డి, జెడి లక్ష్మయ్య, వెచ్చ హరి గోపాల్,చంటి, కందుల కాశిరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur