Konakanamitla: ఇరుసులగుండం 6వ వార్డు అభ్యర్థి పత్రాలు చించారని టీడీపీ నేతలపై ఆరోపణ!
Konakanamitla: మార్కాపురం జిల్లా కోనకనమిట్ల మండలం పెద్దరికట్ల నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి పచమల్ల పుల్లారెడ్డి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించివేశారని ఆరోపణలు వచ్చాయి.
Konakanamitla: ఇరుసులగుండం 6వ వార్డు అభ్యర్థి పత్రాలు చించారని టీడీపీ నేతలపై ఆరోపణ!
కోనకనమిట్ల: మార్కాపురం జిల్లా కోనకనమిట్ల మండలం పెద్దరికట్ల నామినేషన్ కేంద్రం వద్ద ఇరుసులగుండం గ్రామంలోని 6వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన పచమల్ల పుల్లారెడ్డి నామినేషన్ పత్రాలను చించివేసిన టీడీపీ నాయకులు.
ఈ ఘటనకు సంబంధించి టీడీపీకి చెందిన ముగ్గురు నాయకులు పై ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థి పత్రాలను చించివేయడం తో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమకు నచ్చిన వార్డుల నుంచి పోటీ చేసే స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




