Markapuram: మార్కాపురం మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కమిటీ ఎన్నిక
Markapuram: మార్కాపురం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా గుంటక సుబ్బారెడ్డి, కార్యదర్శిగా అన్నా రాము బాధ్యతల స్వీకరణ.
Markapuram: మార్కాపురం మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కమిటీ ఎన్నిక
మార్కాపురం: మార్కాపురం జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులందరి సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు.
గత కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను సభ్యులు ప్రశంసిస్తూ, అదే బృందానికి మరోసారి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడిగా గుంటక సుబ్బారెడ్డి, కార్యదర్శిగా అన్నా రాము, కోశాధికారిగా తడికమళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. తమ సేవలను గుర్తించి మరోసారి బాధ్యతలు అప్పగించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది కూడా మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడతామని, వాటి విజయానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు అందే నాసరయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యులు గుంటక వనజాక్షి, నరసింహంతో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.




