Markapuram: మార్కాపురం దోస్తులు ఇన్స్టాగ్రామ్ పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయి!
Markapuram: మార్కాపురం దోస్తులు ఇన్స్టాగ్రామ్ పేజీ 5 వేల ఫాలోవర్స్ మైలురాయిని చేరుకోవడంతో అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పంపిణీ సేవా కార్యక్రమం.
Markapuram: మార్కాపురం దోస్తులు ఇన్స్టాగ్రామ్ పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయి!
Markapuram: మార్కాపురం జిల్లా లో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువవుతూ వస్తున్న Markapur Dostulu ఇన్‌స్టాగ్రామ్ పేజీ 5 వేల మంది ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా పేజీ అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. తమ పేజీకి 5 వేల మంది ఫాలోవర్స్ అందించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అడ్మిన్ రేవంత్ తెలిపారు.
సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు కూడా వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ పేదలకు అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని కోరారు.




