Markapuram: మార్కాపురంలో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల విజయోత్సవ సభ’

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మార్కెట్ యార్డులో బుధవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరగనుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 Jun 2026 9:48 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల విజయోత్సవ సభ’

Markapuram: మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం 10 గంటలకు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

విజయోత్సవ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story