Markapuram: స్వీయ జనగణనలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజలకు ఆదర్శంగా..!

Markapuram: మార్కాపురంలో స్వీయ జనగణన (Self Enumeration) నమోదు చేసుకున్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 April 2026 12:18 PM IST
Markapuram
X

Markapuram: స్వీయ జనగణనలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజలకు ఆదర్శంగా..!

Markapuram: మార్కాపురం పట్టణంలో నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వీయ గణన నమోదు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ముందుగా నమోదు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తహసీల్దార్ కె. చిరంజీవి, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాసులు కలిసి సెన్సస్ షీల్డ్ను అందజేశారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ప్రజల సహకారంతోనే సమగ్ర జనగణన సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు స్వీయ గణన నమోదు చేసుకుని ప్రభుత్వానికి సరైన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story