Markapuram: మార్కాపురంలో ప్రజా దర్బార్ జనంతో కిక్కిరిసిన టీడీపీ కార్యాలయం!

Markapuram: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 April 2026 3:18 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ప్రజా దర్బార్ జనంతో కిక్కిరిసిన టీడీపీ కార్యాలయం!

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అన్ని శాఖల అధికారుల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ పరిష్కారం సాధ్యమైన అంశాలపై వెంటనే స్పందించారు.మొత్తం 150 అర్జీలు అందగా, వాటిలో అధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే కావడం గమనార్హం. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్లు, సర్వే సమస్యలు, రికార్డు సవరణలు వంటి అంశాలు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మిగిలిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని అధికారులను హెచ్చరించిన ఆయన, ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే, కందుల నారాయణరెడ్డి, ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే వేదికగా కొనసాగుతుందని తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story