Markapuram: అధికారుల నిర్లక్ష్యం ఒకరి రిటైర్మెంట్.. మరొకరి ఉద్యోగం!
Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ అధికారుల తప్పిదంతో ఆప్కాస్ (APCOS) జాబితాలో పేరు కోల్పోయిన కార్మికుడు తప్పెట్ల శేషుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.
Markapuram: అధికారుల నిర్లక్ష్యం ఒకరి రిటైర్మెంట్.. మరొకరి ఉద్యోగం!
Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం మున్సిపల్ అధికారుల తప్పిదంతో ఓ కార్మికుడు ఆప్కాస్ జాబితాలో చోటు కోల్పోయాడు. ఫలితంగా మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నా వేతనం మాత్రం అందుకోలేని పరిస్థితి నెలకొంది. బాధ్యత కార్మికుడు తప్పెట్ల శేషుకు అండగా సిఐటియు నిలిచింది. మార్కాపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఈ మేరకు బుధవారం ధర్నా జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి కె యం రఫీ పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల మార్కాపురం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆయన ఖండించారు. ఒకే పేరుతో తప్పెట్ల శేషులు పేరు గల వారు ఇద్దరు కార్మికులు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక కార్మికుడు 60 సంవత్సరాలు రిటైర్ అయిన సందర్భంగా ఆయన పేరు ను తొలగిస్తూ అదే పేరు గల తప్పెట్ల శేషులు పేరును ఆప్కాస్ నుండి తొలగించడం జరిగింది. ఒక కార్మికుడి పేరు తొలగించే ముందు అధికారులు సరియైన పర్యవేక్షణ లేకుండా పేర్లు తొలగించి కార్మికుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారని ఆయన విమర్శించారు.
పేరు తొలగించడంతో మూడు నెలలుగా తప్పెట్ల శేషులుకు వేతనం లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నానని అధికారులకు మొరపెట్టుకున్న తప్పెట్ల శేషులు పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ఆప్కాస్ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిష్కారం చేయడంలో పట్టి పట్టనట్లుగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్కాపురం మున్సిపల్ అధికారుల వైఖరి మార్చుకొని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆప్కాస్ హెడ్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించడంలో అధికారులు జోక్యం చేసుకొని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించని ఎడల కార్మికులు మెరుపు సమ్మెకు సిద్ధమవుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కే.సుబ్బరాయుడు, జి హరి, జిపి తిరుమలయ్య, ఏ రమణ, ఎం చెన్నకేశవులు, చెన్నయ్య, శేఖర్, ఇబ్రహీం, ఎస్.కె యూసఫ్, రసీద్, దాసు, ఎన్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.




