Markapuram: రైల్వే ట్రాక్ వద్ద యువకుడి ప్రాణం కాపాడిన మార్కాపురం పోలీసులు
Markapuram: మార్కాపురంలో రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన బండి రామదాసు అనే యువకుడిని ఐటీ కోర్ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు సకాలంలో కాపాడారు.
Markapuram: రైల్వే ట్రాక్ వద్ద యువకుడి ప్రాణం కాపాడిన మార్కాపురం పోలీసులు
Markapuram: మార్కాపురం పట్టణానికి చెందిన బండి రామదాసు (35) కుటుంబ సమస్యల కారణంగా సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతని స్నేహితుడు అద్దంకి మాధవ వెంటనే డయల్-112కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఎస్సై వి. వేమన, సిబ్బంది మరియు ఐటీ కోర్ టీం సాంకేతిక పరిజ్ఞానంతో రామదాసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని సకాలంలో స్పందించి అతడిని రక్షించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
తదుపరి రామదాసుకు కౌన్సిలింగ్ నిర్వహించి మానసిక ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై వి. వేమన, హెడ్ గార్డు నోవా, డ్రైవర్ బాషా మరియు ఐటీ కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ అభినందించారు.




