Markapuram: మార్కాపురంలో పోలీసుల మెరుపు తనిఖీలు!
Markapuram: మార్కాపురం పట్టణంలో పోలీసులు శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో చలానాలు విధించారు.
Markapuram: మార్కాపురంలో పోలీసుల మెరుపు తనిఖీలు!
మార్కాపురం: పట్టణంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథరెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ బుక్ షాప్ సెంటర్ వద్ద పోలీసు సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నవారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారికి చలానాలు విధించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ
రోడ్లపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఇద్దరికి మించి ముగ్గురు బైక్‌పై ప్రయాణించడం, సీట్‌బెల్ట్ లేకుండా వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఎస్సై విశ్వనాథరెడ్డి హెచ్చరించారు.




