Markapuram: పోతవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి.. ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో!
Markapuram: పొదిలి మండలం పోతవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించిన మహిళలు. అధికారుల తీరుపై నిరసన.
Markapuram: పోతవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి.. ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో!
Markapuram: మార్కాపురం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత 20 రోజులుగా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
తాగునీటి సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు తాత్కాలికంగా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ, కొద్దిరోజులకే మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోందని ఆరోపించారు.
రోజువారీ అవసరాలకు సైతం నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి పరిస్థితుల్లో నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని వాపోయారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీటి సరఫరా చేయాలని పోతవరం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




