Markapuram: మార్కాపురం బస్టాండ్‌లో దొంగల దందా.. భయాందోళనలో ప్రయాణికులు

Markapuram: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. బస్సు ఎక్కే ప్రయాణికులను టార్గెట్ చేస్తూ సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులను కొల్లగొడుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Jun 2026 12:26 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం బస్టాండ్‌లో దొంగల దందా.. భయాందోళనలో ప్రయాణికులు

మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. బస్టాండ్‌లో కొద్దిసేపు కూర్చోవాలన్నా, బస్సు ఎక్కాలన్నా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల సెల్‌ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్ ఆవరణలో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చోరీ ఘటనలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. చోరులు తమ పని తాము చేసుకుని సులభంగా తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

దీంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ అధికారులు, పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేసి చోరీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story