Peddadornala: పెద్దదోర్నాల మండలంలో 8,851 మంది ఓటర్లకు నోటీసులు!
Peddadornala: పెద్దదోర్నాల మండలంలో 8,851 మంది ఓటర్లకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. సరిదిద్దుకునేందుకు సెప్టెంబర్ 21 వరకు అవకాశం కల్పించారు.
Peddadornala: పెద్దదోర్నాల మండలంలో 8,851 మంది ఓటర్లకు నోటీసులు!
Peddadornala: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలో మొత్తం 45 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తహసీల్దార్ సిహెచ్. అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేసే ప్రక్రియలో మండల పరిధిలో 3,141 మంది ఓటర్ల వివరాలు తల్లిదండ్రుల ఓట్లతో మ్యాపింగ్ కాలేదని గుర్తించినట్లు తెలిపారు.
మరో 5,710 మంది ఓటర్లకు మ్యాపింగ్ జరిగినప్పటికీ ఇంటిపేర్లు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.ఈ నేపథ్యంలో మొత్తం 8,851 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు విచారణ నిమిత్తం ఏఈఆర్వో, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో హాజరుకావాలని సూచించారు.
ఈ విచారణ ఈ నెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు కొనసాగుతుందని, విచారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని తహసీల్దార్ సిహెచ్. అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు.




