Markapuram: బి. చెర్లోపల్లెలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

Markapuram: బి. చెర్లోపల్లెలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు. మూడు పాఠశాలల్లోనూ ఏకగ్రీవంగా కమిటీల ఎన్నిక. నూతన చైర్మన్లను అభినందించిన గ్రామ పెద్దలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Sept 2026 6:27 PM IST
Markapuram
X

Markapuram: బి. చెర్లోపల్లెలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బి. చెర్లోపల్లె గ్రామంలో సోమవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. గ్రామంలోని మూడు పాఠశాలలకు సంబంధించిన ఎస్‌ఎంసీ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో ఒక కమిటీకి టీడీపీ మద్దతుదారులు, మరో కమిటీకి వైసీపీ మద్దతుదారులు ఎన్నిక కాగా, ఎస్సీ పాలెం ఎలిమెంటరీ పాఠశాలలో సంప్రదాయం ప్రకారం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీడీపీ మద్దతుతో జెడ్పీ హైస్కూల్ కమిటీ

గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా టీడీపీ బలపరిచిన నంద్యాల సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్‌గా కోటపాటి అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైసీపీ మద్దతుతో ఎలిమెంటరీ పాఠశాల కమిటీ

గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా వైసీపీ బలపరిచిన తాళ్ల ధనలక్ష్మి, వైస్ చైర్మన్‌గా అమ్మిరెడ్డి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంప్రదాయం ప్రకారం ఎస్సీ పాలెం కమిటీ

ఎస్సీ పాలెంలోని ఎలిమెంటరీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గ్రామస్తులు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రతి ఎన్నికలో ఒక కుటుంబానికి చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా కేటాయించే ఆనవాయితీ ప్రకారం ఈసారి జడ్డా బాబు చైర్మన్‌గా, జడ్డా బేబీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో పది మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీలకు గ్రామ పెద్దల అభినందనలు

మూడు పాఠశాలలకు చెందిన నూతన చైర్మన్లు నంద్యాల సుబ్బారెడ్డి, తాళ్ల ధనలక్ష్మి, జడ్డా బాబుతో పాటు వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులను మాజీ సర్పంచ్ ఆకుమళ్ల శ్రీనివాసరెడ్డి, మూల అల్లూరిరెడ్డి, మాడుగుల వెంకటేశ్వరరెడ్డి, మూల రామకోటిరెడ్డి, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ , సుబ్రమణ్యం, HMTV REPOTER యన్నం. శ్రీనివాసులు ,ఎస్సీ నాయకులు జడ్డా అబ్రహం, జడ్డా పెద్ద నాగయ్య, జడ్డా ప్రేమయ్య, జడ్డా భూషయ్య, ప్రసాద్, మూడుమంచు కొండయ్య తదితరులు అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధిలో ఎస్‌ఎంసీ కమిటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడం వంటి అంశాలకు నూతన కమిటీలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో సమన్వయంగా పనిచేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. మూడు పాఠశాలల్లోనూ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నికలకు సహకరించిన తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM