Markapuram: మార్కాపురం మండలం రాయవరంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం!
Markapuram: మార్కాపురం మండలం రాయవరంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం. ఆర్‌టీఓ ఆఫీస్ వెనుక పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు.
Markapuram: మార్కాపురం మండలం రాయవరంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం!
Markapuram: మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలో క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు కలకలం రేపాయి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న పొలంలో ముగ్గులు వేసి, మధ్యలో బొమ్మలాంటి వస్తువులు ఉంచినట్లు స్థానికులు గుర్తించారు.
అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటంతో చేతబడి తరహా పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు అధికారులకు అందించారు.
అయితే, అక్కడ నిజంగా ఎలాంటి పూజలు నిర్వహించారనే విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అధికారులు స్పందించి పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.




