Markapuram: పోలీస్ అమరవీరుల స్మారకార్థం ఘనంగా క్యాండిల్ ర్యాలీ!

Markapuram: మార్కాపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం భారీ క్యాండిల్ ర్యాలీ. కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పాల్గొని అమరులకు నివాళులర్పించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 Oct 2026 11:43 PM IST
Markapuram
X

Markapuram: పోలీస్ అమరవీరుల స్మారకార్థం ఘనంగా క్యాండిల్ ర్యాలీ!

మార్కాపురం: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సోమవారం మార్కాపురంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణతో పాటు విపత్తులు, ఎన్నికలు, పండుగల సమయంలో పోలీసులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీసుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్, మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఆర్‌ఐ ఓ. కిరణ్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM