Markapuram: ఎర్రగొండపాలెంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ!
Markapuram: ఎర్రగొండపాలెంలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Markapuram: ఎర్రగొండపాలెంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ!
మార్కాపురం: మార్కాపురం జిల్లా, ఎర్రగొండపాలెంలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా సందర్శించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నిన్నటి రోజు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో జనసందోహం లేకుండా చర్యలు తీసుకోవాలని, నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులను క్యూలో క్రమపద్ధతిలో కేంద్రంలోకి అనుమతించాలని ఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.




