Yerragondapalem: నామినేషన్ పత్రాల చింపివేత: పోలీసుల లాఠీఛార్జ్!
Yerragondapalem: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
Yerragondapalem: నామినేషన్ పత్రాల చింపివేత: పోలీసుల లాఠీఛార్జ్!
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లోని ఎంపిటీసి ల నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వైసిపి కి చెందిన నాయకులు తమ అభ్యర్ధులను నామినేషన్ వేసేందుకు వస్తుండగా టిడిపి నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలను చించి వేసారు.
ఈ క్రమంలో ఇరు పార్టీల వారు కొట్టు కోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గంజివారిపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి తమవారితో నామినేషన్ లు వెయ్యించాలని సీఐ అజయ్ కుమార్ ను వేడుకున్నాడు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని లాఠీ లతో చెదరకొట్టారు.
దీంతో ఇరువర్గా వారు చెరొక వైపు మొహరించడంతో ఎప్పుడు ఎమి జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు మరొక సారి ఇరువర్గాల వారిని ఎక్కడికక్కడ పంపించే ప్రయత్నం చెయ్యగా వైసిపి వారు జాతీయ రహదారి పై బైటాయించారు. అన్యాయంగా తమ వారిని నామినేషన్ లు వెయ్యనీయ్యకుండా తమపై దాడులు చేస్తున్నాని న్యాయం చెయ్యాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు.




