Yerragondapalem: పెద్ద దోర్నాల కార్యకర్తలకు గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపు!

Yerragondapalem: పెద్ద దోర్నాల మండలంలోని 14 పంచాయతీల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు.

Srikanth Singam, Markapur
Published on: 15 Nov 2026 5:47 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: పెద్ద దోర్నాల కార్యకర్తలకు గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపు!

ఎర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లో 14 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు.

పెద్ద దోర్నాలలోని శ్రీశైలం రహదారిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయాలు సాధించేందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఎరిక్షన్ బాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur