Markapuram: మార్కాపురంలో రేపటి నుంచి వైసీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం ప్రారంభం

Markapuram: మార్కాపురం మున్సిపల్ ప్రచారానికి వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ సిద్ధం. రేపు బంగారమ్మ గుడి వద్ద పూజల తర్వాత 1, 4 వార్డుల్లో ప్రచారం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 Oct 2026 8:58 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో రేపటి నుంచి వైసీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం ప్రారంభం

మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

రేపు ఉదయం 8 గంటలకు పట్టణంలోని బంగారమ్మ గుడి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 1వ, 4వ వార్డుల్లో ప్రచారం ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్కాపురం పట్టణ వైసీపీ అధ్యక్షుడు షేక్ సలీమ్ పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM