Markapuram: చిన్నఅలవలపాడులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ప్రచారం!

Markapuram: మార్కాపురం కనిగిరి మండలం చిన్నఅలవలపాడులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ విస్తృత ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.

Guravayya, Kanigiri
Published on: 31 Oct 2026 2:29 PM IST
Markapuram
X

Markapuram: చిన్నఅలవలపాడులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ప్రచారం!

Markapuram: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపు మేరకు, మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం కనిగిరి మండలంలోని చిన్నఅలవలపాడు పంచాయతీ పరిధిలోని మండాదివారిపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నఅలవలపాడు గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఓటరును నేరుగా కలుసుకుని నమూనా బ్యాలెట్ పత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri