marripudi: మర్రిపూడి మండలంలో 15 మందికి త్రిబుల్ ఐటీ సీట్లు!

marripudi: ప్రకాశం జిల్లా మర్రిపూడి ఏఏ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ ఉయ్యాల శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 4 July 2026 4:31 PM IST
marripudi
X

marripudi: మర్రిపూడి మండలంలో 15 మందికి త్రిబుల్ ఐటీ సీట్లు!

మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి ఏఏ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించి పిల్లలతో మధ్యన కూర్చుని భోజనం చేసిన ఎంఈఓ ఉయ్యాల శ్రీనివాసులు శనివారం సాధారణ తనిఖీలో భాగంగా ఆయన పాఠశాలల పరిసరాలను మరియు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన కోరారు, ముఖ్యంగా నవోదయ మరియు గురుకుల పాఠశాలలకు పైతరగతికి వెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

అదేవిధంగా దాతల సహకారంతో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలలో పలు మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఎంఈఓ శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆయా పనులను స్వయంగా పరిశీలించి దాతలను అభినందించారు.

ఆయన మాట్లాడుతూ మండలములో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం 15 మంది విద్యార్థిని విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో చోటు దక్కించుకున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనో ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని కుకింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఉపాధ్యాయునీయులు లీలావతి అనూష ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story