Medarametla: దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ నేతృత్వంలో కార్డెన్ సెర్చ్
Medarametla: ప్రకాశం జిల్లా కోరిసపాడు మండలం మేదరమెట్ల దర్గా సెంటర్ పరిధిలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Medarametla: దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ నేతృత్వంలో కార్డెన్ సెర్చ్
Medarametla: ప్రకాశం జిల్లా కోరిసపాడు మండలం మేదరమెట్ల లోని దర్గా సెంటర్ వద్ద పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డి.ఎస్.పి నేతృత్వంలో ఇంటింటి నీ జల్లెడ పట్టగా 75 ద్విచక్ర వాహనాలు 1ఫోర్ వీలర్ ఆటో 1త్రీ వీలర్ ఆటో స్వాధీనం చేసుకొని పత్రాలు పరిశీలిస్తున్నామన్నారు, ప్రజలందరూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని వాటికి దూరంగా ఉండాలన్నారు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు, ఈ ఆపరేషన్ లో దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు అని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో అద్దంకి సీఐ సుబ్బరాజు, రూరల్ సీఐ మల్లికార్జున, సంతమాగులూరు సీఐ శేషగిరి, మేదరమెట్ల పంగులూరు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




