Markapuram: బతికున్న మనిషిని శవమన్నారు.. కొనకనమిట్లలో విషాదం!

Markapuram: ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని బలిగొంది.

MADARVALI, MARKAPURAM
Updated on: 13 May 2026 7:38 AM IST
Markapuram
X

Markapuram: బతికున్న మనిషిని శవమన్నారు.. కొనకనమిట్లలో విషాదం!

Markapuram: వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తో నిండు ప్రాణం పొయిందని ఆపద సమయంలో ఆసుపత్రికి వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించి బ్రతికున్న మనిషిని చనిపొయాడని నిర్దారించి వైద్యశాల బల్లమీద పడుకొబెట్టారని ప్రకాశంజిల్లా కొనకనమిట్ల గ్రామానికి చెందిన బాధితులు వాపొయ్యారు.

మార్కాపురంజిల్లా కొనకనమిట్లలో నివాసం ఉంటున్న నిశనం డేవిడ్ గుండెనొప్పితో బందువుల సహయంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొనిరాగా ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేక సిబ్బంది పట్టించుకొకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి చనిపొయాడని నిర్దారించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటికి మనిషిగుండె కొట్టుకుండటంతో ప్రాణం ఉందని అక్కడనుంచి పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చిన తరువాత వైద్యులు సిపిఆర్ చేసి ప్రయత్నించంగా విఫలమయ్యారని మృతుని కుమార్తెలు ఆరొపించారు.

దాదాపు గంటన్నర సేపు సిబ్బంది పట్టించుకొక వైద్యులు అందుబాటులో లేక మానాన్నను పొగొట్టుకున్నామని కేవలం కొనకనమిట్ల ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మా కుటుంబ యజామనిని కొల్పయామని ఆవేదన వ్యక్తం చేశారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story