Santanuthalapadu: దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదమే అస్త్రం!

Santanuthalapadu: సంతనూతలపాడులో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 12 May 2026 6:00 PM IST
Santanuthalapadu
X

Santanuthalapadu: దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదమే అస్త్రం!

సంతనూతలపాడు: సంతనూతలపాడు లోని జండా చెట్టు వద్ద గల శ్రీ వీరాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా సంతనూతలపాడు మండల ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరంలో 120 మంది రోగులకు చికిత్సలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

స్థానిక యాదవ్ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఆయుర్వేద శాఖ వారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క వైద్య శిఖరంలో మోకాలు నొప్పులు, గ్యాస్టిక్ ట్రబుల్, నడుము నొప్పి, చిగుళ్ళు సమస్యలు, చర్మవ్యాధులు, వివిధ రకాల పాత వ్యాధులను రోగులకు సంబంధించి వైద్యులు కరుణాకర్ రావు పరీక్షించి తదుపరి మందులు పంపిణీ చేశారు.

దీర్ఘ కాలిక వ్యాధులకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం అని ప్రజలు దీనిని సద్వినియోగపరుచుకోవాలని వైద్యులు కరుణాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఎం ఎన్ ఓ. పి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story