Darsi: ఆరుబయట నిద్రిస్తుండగా ఇల్లు గుల్ల చేసిన దొంగలు!
Darsi: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త రెడ్డిపాలెంలో భారీ దొంగతనం జరిగింది.
Darsi: ఆరుబయట నిద్రిస్తుండగా ఇల్లు గుల్ల చేసిన దొంగలు!
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త రెడ్డిపాలెం లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు కొత్త రెడ్డిపాలెం గ్రామానికి చెందిన తూము శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటి ఆరు బయట నిద్రిస్తుండగా, తెల్లవారుజామున దుండగులు ఇంటి లోనికి చొరబడి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టి రూ.5 లక్షల నగదు, 4 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
తెల్లవారిన తరువాత నిద్రలేచిన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటం, బీరువాలోని సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న దర్శి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు దర్శిఎస్ఐ మురళి సీఐ వై రామారావు తెలిపారు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.




