Tripuranthakam: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మెగా యోగా శిబిరం
Tripuranthakam: త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మెగా యోగా శిబిరంలో మార్కాపురం కలెక్టర్ విజయ సునీత పాల్గొని ఆసనాలు వేశారు.
Tripuranthakam: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మెగా యోగా శిబిరం
త్రిపురాంతకం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన మెగా యోగా శిబిరంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఏరిక్షన్ బాబు, అధికారులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ అందరితో కలిసి వివిధ యోగాసనాలు చేసి యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.




