Addanki: రూ.1.92 కోట్ల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి!

Addanki: అద్దంకిలో రూ.1.92 కోట్ల CMRF చెక్కులు, LOCలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 14 Oct 2026 4:08 PM IST
Addanki
X

Addanki: రూ.1.92 కోట్ల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి!

Addanki: అద్దంకి ఆర్డీఓ కార్యాల‌యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.అద్దంకి నియోజకవర్గ ంలో రూ.1.92 కోట్ల విలువైన 217 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 31 ఎల్ఓసీల‌ను ల‌బ్ధిదారుల‌కు మంత్రి అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధితో ఆర్థిక‌భరోసాఇస్తున్నారానున్నారు.వైద్య ఖర్చుల భారంతో బాధ‌ప‌డుతున్న‌ కుటుంబాలకు కూట‌మి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు

అత్యవసర వైద్యం అవసరమైన వారికి ఎల్‌ఓసీలతో సకాలంలో చికిత్సకు చేయూత అందిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ పేద కుటుంబానికీ వైద్యం దూరం కాకూడదన్నదే సీఎం చంద్ర‌బాబు ఉద్దేశం అని చెప్పారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించిన అర్జీలు ను మంత్రి పరిశీలించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు మంత్రి సూచించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL