Dornala: వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రి సీరియస్ గడువులోగా పూర్తి చేయాలి

Dornala: మార్కాపురం జిల్లా కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 May 2026 5:27 PM IST
Dornala
X

Dornala: వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రి సీరియస్ గడువులోగా పూర్తి చేయాలి

దోర్నాల: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరు గ్రామం సమీపంలో కొనసాగుతున్న శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అధికారులతో, గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పనుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, మిగిలిన పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ముఖ్యంగా హెడ్ రెగ్యులేటర్ పనులు, వింగ్ వాల్స్ పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

టన్నెల్ పనులు, కాల్వల నిర్మాణం వంటి కీలక దశలను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని తెలిపారు. పనుల్లో నాణ్యతకు ఎలాంటి లోపం ఉండకూడదని, నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించారు. అవసరమైన యంత్రాలు, సిబ్బంది సమృద్ధిగా ఏర్పాటు చేసి పనులు నిరంతరం కొనసాగించాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో ఎస్సీ అబుతలిం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ప్రజల సహకారం తీసుకొని పనులు సజావుగా ముందుకు సాగేలాగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story