Addanki: అద్దంకిలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గొట్టిపాటి!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Kolla Singaiah, Addanki
Published on: 24 Oct 2026 12:30 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గొట్టిపాటి!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ అద్దంకిలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకాని అశోక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు.

అలాగే పట్టణంలో మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన అన్ని వార్డుల్లోనూ తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.అద్దంకి మండలం, పట్టణ పరిధిలో ఇప్పటివరకు నాలుగు వేల నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. త్వరలో పట్టణంలో పార్కు, మీటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అద్దంకి పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki