Addanki: అద్దంకిలో కూటమి ప్రచారం: మంత్రి గొట్టిపాటి, ఎంపీ తెన్నేటి

Addanki: అద్దంకి పురపాలక ఎన్నికల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి కాకాని అశోక్, కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ తెన్నేటి ప్రచారం చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 30 Oct 2026 3:37 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో కూటమి ప్రచారం: మంత్రి గొట్టిపాటి, ఎంపీ తెన్నేటి

అద్దంకి: అద్దంకి పురపాలక సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పురపాలక సంఘం పరిధిలోని 31 , 32వ వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. అద్దంకి పురపాలక సంఘంలోని 31 వార్డుల్లో కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్నారని, చైర్‌పర్సన్ అభ్యర్థిగా కాకాని అశోక్ బరిలో ఉన్నారని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించి అభివృద్ధి చేసే అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. చెప్పాం.. చేశాం.. అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని, రాబోయే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో, పురపాలక సంఘంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు.

చైర్‌పర్సన్ అభ్యర్థి కాకాని అశోక్ మాట్లాడుతూ.. మార్పుకు అనుగుణంగా అద్దంకి పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన, మెరుగైన పాలన అందిస్తానని తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki