Addanki: రూ.1.04 కోట్ల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి!
Addanki: అద్దంకిలో 128 మంది లబ్ధిదారులకు రూ.1.04 కోట్ల విలువైన CMRF చెక్కులు, LOC పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Addanki: రూ.1.04 కోట్ల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో అద్దంకి నియోజకవర్గంలోని 128 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1.04 కోట్ల విలువైన CMRF చెక్కులు, LOC పత్రాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
Next Story




