Medarametla: హైబ్రిడ్ మహానాడు’ సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి!
Medarametla: మేదరమెట్ల ఎస్బీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ‘హైబ్రిడ్ మహానాడు - 2026’లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Medarametla: హైబ్రిడ్ మహానాడు’ సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి!
మేదరమెట్ల: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఎస్బి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు - 2026 కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహానేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.హైబ్రిడ్ మహానాడులో పాల్గొన్న తెలుగు మహిళలను మంత్రి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారితో మమేకమయ్యారు.




