Prakasam: ప్రజల వద్దకే పాలన.. నియోజకవర్గంలో రూ.25 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Prakasam: ప్రకాశం జిల్లా సంతమాగులూరులో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.
Prakasam: ప్రజల వద్దకే పాలన.. నియోజకవర్గంలో రూ.25 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Prakasam: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సంతమాగులూరు లో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక నెలలో ఒక నియోజకవర్గం లో నాలుగు శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చేపడుతున్నామన్నారు , రెగ్యులర్గా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ తో పాటు ఈ కార్యక్రమం జరుగుతాయని తెలిపారు , మొత్తం 204 అర్జీలలో రెవెన్యూ సమస్యలు 50 శాతం వచ్చాయని నూతన పింఛన్లు కావాలని 40 అర్జీలు, తో పాటు ఇతర శాఖల ద్వారా వారి సమస్యల పరిష్కరించాలని కొన్ని అర్జీలు వచ్చాయనీ వాటిని అధికారులు సత్వరమే 100% పూర్తి చేయాలని అధికారులుకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో మన రాష్ట్రం అత్యధిక పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు, పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ పవర్ ను అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలు అర్హులున్న లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు , నియోజవర్గంలో గ్రామాలలో నూతన రోడ్లు , సైడ్ కాలువలు సబ్ స్టేషన్లు , కమ్యూనిటీ హాల్స్ ఆరో ప్లాంట్స్ , ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు దివ్యాంగులు స్కూటీలు , ట్రై సైకిళ్లు , నియోజవర్గంలో 25 కోట్ల 31 లక్ష ,79 వేలు రూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు 2938 మంది లబ్ధిదారులకు పంపిణీ అందజేయడం జరిగిందని తెలిపారు.




