Dornala: గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి విద్య అందాలి మంత్రి గొట్టిపాటి

Dornala: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలలో వేమన ఇంటర్నేషనల్ స్కూల్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు.

Srikanth Singam, Markapur
Published on: 17 Jun 2026 7:23 PM IST
Dornala
X

Dornala: గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి విద్య అందాలి మంత్రి గొట్టిపాటి

దోర్నాల: చిన్న దోర్నాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేమన ఇంటర్నేషనల్ స్కూల్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యతనిస్తూ విద్యాసంస్థలు ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక విద్యా విధానాలతో విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధిలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాలతో విద్యాసంస్థలు ఏర్పాటు కావడం స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాలను అతిథులు పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతో పాటు విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థ ప్రతినిధులు, బట్టు రమణారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story