Prakasam: ప్రకాశం జిల్లాలో ‘పీఎం సూర్యఘర్’ ధూం ధాం

Prakasam: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విస్తృతంగా పర్యటించారు.

Kolla Singaiah, Addanki
Published on: 11 Jun 2026 4:17 PM IST
Prakasam
X

Prakasam: ప్రకాశం జిల్లాలో ‘పీఎం సూర్యఘర్’ ధూం ధాం

Prakasam: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు .మండలం లోని వెలమవారిపాలెం, జమ్మలమడక, కొత్తూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

జమ్మలమడక, వెలమవారిపాలెం ఎస్సీ కాలనీల్లో సూర్యఘర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్నికల హామీల్లో భాగంగా వి.కొప్పెరపాడు నుంచి జమ్మలమడక వరకు రూ. 6 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు.

కొత్తూరు గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీరోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు.ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా మూడు గ్రామాల్లో 800 పైగా పోల్స్ మార్పిడి చేస్తున్నామన్నారు.లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. మూడు గ్రామాల పరిధిలో ఉచితంగా 200 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అందించామన్నారు.

గ్రామాల్లోముందుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ పీఎం సూర్యఘర్ కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజా సమస్యలను త్వరితగతిన అధికారులు పరిష్కరించాలని ఆదేశం నిచ్చారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story