Prakasam: ఉచిత సోలార్‌తో పాటు రూ.20 వేల రాయితీ.. మంత్రి సూపర్ న్యూస్!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడిలో రూ. 4.15 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.
Prakasam: ఉచిత సోలార్‌తో పాటు రూ.20 వేల రాయితీ.. మంత్రి సూపర్ న్యూస్!
ప్రకాశం జిల్లా: అద్దంకి మండలం కొటికలపూడి గ్రామపంచాయతీ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పార్వతీపురం, తిమ్మారెడ్డిపాలెం నుంచి కొటికలపూడి వరకు రూ. 3 కోట్ల 85 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డున మంత్రి ప్రారంభించారు. కొటికలపూడి పంచాయతీ పరిధిలో రూ. 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు అనంతరం శ్రీరామ్ నగర్ ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు.
సూర్యఘర్ పథకానికి ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్న 6 లక్షల మందికి సోలార్ ఉచితంగా అందిస్తున్నామని మంత్రి చెప్పారు పీఎం సూర్యఘర్ ద్వారా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేలు రాయితీ ఇస్తుందన్నారు రాష్ట్రంలోమొత్తం 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యం అని మంత్రి తెలిపారు విద్యుత్ శాఖలో సూర్యఘర్ తో పాటు ఆర్డీఎస్ఎస్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.




