Dornala: దోర్నాలలో రూ. కోటితో సరికొత్త బస్టాండ్ శ్రీశైలం యాత్రికులకు!

Dornala: ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 21 May 2026 11:48 AM IST
Dornala
X

Dornala: దోర్నాలలో రూ. కోటితో సరికొత్త బస్టాండ్ శ్రీశైలం యాత్రికులకు!

దోర్నాల: శతాబ్దకాలంగా ఆర్టీసీ బస్టాండ్ లేక ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారంగా పెద్ద దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. స్థానిక నటరాజ్ కూడలిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ బస్టాండ్‌కు మంత్రి రిబ్బన్ కత్తిరించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, పెద్ద దోర్నాల ప్రాంతం రవాణా పరంగా కీలక కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రతిరోజూ దోర్నాల సెంటర్ నుంచి 400కు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నాయని తెలిపారు. అలాగే రోజుకు సుమారు 30 వేల నుంచి 40 వేల మంది వరకు శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం దేవస్థానంకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో, ఆధునిక సదుపాయాలతో కూడిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎర్రగొండపాలెం తెలుగు దేశం పార్టీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ బస్టాండ్ నిర్మాణంతో పెద్ద దోర్నాల ప్రాంత ప్రజలతో పాటు శ్రీశైలం యాత్రికులకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story