Ongole: రాడిసన్ రవిప్రియ హోటల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!

Ongole: ఒంగోలులో ప్రతిష్ఠాత్మక రాడిసన్‌ రవిప్రియ హోటల్‌ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 28 Aug 2026 11:05 PM IST
Ongole
X

Ongole: రాడిసన్ రవిప్రియ హోటల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!

ఒంగోలు: ఒంగోలులో ప్రతిష్ఠాత్మక రాడిసన్‌ రవిప్రియ హోటల్‌ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో కలిసి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి లోకేష్‌తో కలిసి ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక పూజలు నిర్వహించి హోటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ప్రముఖ హోటల్‌ నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటక, వాణిజ్య రంగాలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హోటల్‌ యాజమాన్యానికి ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. రాడిసన్‌ వంటి అంతర్జాతీయ స్థాయి హోటల్‌ ఏర్పాటుతో ఒంగోలు నగరానికి మరింత గుర్తింపు లభించడంతో పాటు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story