Giddalur: చంద్రబాబు సభలో గుండెపోటుతో మృతి రూ.2 లక్షల సాయం చేసిన ఎమ్మెల్యే
Giddalur: సీఎం చంద్రబాబు సభకు హాజరై గుండెపోటుతో మరణించిన రవికుమార్ కుటుంబాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరామర్శించి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.
Giddalur: చంద్రబాబు సభలో గుండెపోటుతో మృతి రూ.2 లక్షల సాయం చేసిన ఎమ్మెల్యే
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో నిన్న నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభకు హాజరైన బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన శ్రీరాం రవికుమార్ (48) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బాధిత ఆకుటుంబానికి రూ.2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పార్టీ మరియు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని మీ యొక్క కుటుంబ పరిస్థితినీ ప్రభుత్వం దృష్టికి తీసుకోనివెళ్లి పార్టీ తరుపున ఆదుకునేలా చూస్తాను అని భరోసా ఇచ్చారు.
Next Story




